Thursday, March 12, 2026
Homeతెలంగాణరంగారెడ్డిIbrahimpatnam: బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. ఇబ్రహీంపట్నం ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు స్టే.!

Ibrahimpatnam: బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. ఇబ్రహీంపట్నం ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు స్టే.!

Ibrahimpatnam Municipality: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి బీఆర్‌ఎస్‌కి ఖరారైన కాసేపటికే ఆ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/warangal-news/congress-won-municipalities-in-jangaon-and-thorrur-through-lottery/

ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి టేకు సుదర్శన్ రెడ్డి ఛైర్మన్‌(15 ఓట్లు)గా, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ముత్యాల శ్యామల ఎన్నికైన కొద్ది సేపటికే హైకోర్టు స్టే ఉత్తర్వులతో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఎన్నికను ఫిబ్రవరి 19 వరకు నిలిపివేయాలంటూ ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలతో ఎన్నికను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: https://teluguprabha.net/top-stories/cm-revanth-reddy-participates-in-bio-asia-2026-conference/

కాగా, ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది. కౌన్సిలర్లు పరస్పరం కుర్చీలు విసురుకోవడంతో రణరంగ వాతావరణాన్ని తలపించింది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఆ ప్రాంతంలో సెక్షన్ 163 అమలు చేశారు. సుమారు 800 మంది బలగాలు మోహరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News