Homeతెలంగాణరంగారెడ్డిGhatkesar: కర్ణాటక బీజేపీ సహ ఇన్‌చార్జిగా కాసం వెంకటేశ్వర్లు.. సన్మానించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి

Ghatkesar: కర్ణాటక బీజేపీ సహ ఇన్‌చార్జిగా కాసం వెంకటేశ్వర్లు.. సన్మానించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి

ఘట్ కేసర్(తెలుగుప్రభ): బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ సంస్థాగత బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకులు కాసం వెంకటేశ్వర్లు అని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. కర్ణాటక బిజెపి సహ ఇన్ ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన కాసం వెంకటేశ్వర్లను శనివారం ఏనుగు సుదర్శన్ రెడ్డి మర్యదాపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్ణాటక బీజేపీ సహ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించడం పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. కొత్త బాధ్యతల్లో సమన్వయంతో పనిచేస్తూ కర్ణాటకలో పార్టీ సంస్థాగత కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News