Homeతెలంగాణరంగారెడ్డిHayathnagar: హయత్ నగర్‌లో భూ వివాదం.. అనాథ పిల్లలపై దౌర్జన్యం

Hayathnagar: హయత్ నగర్‌లో భూ వివాదం.. అనాథ పిల్లలపై దౌర్జన్యం

Land dispute: హైదరాబాద్‌లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో విక్రయించిన ప్లాట్ తమదేనంటూ కొందరు వ్యక్తులు అనాథ పిల్లలపై దాడికి దిగడం స్థానికంగా కలకలం సృష్టించింది.

- Advertisement -

రాళ్లు, కర్రలతో భీభత్సం: 2009 సంవత్సరంలో విక్రయించిన ప్లాట్‌తో పాటు ఆ స్థలంలో నిర్మించుకున్న ఇల్లు కూడా తమదేనంటూ సోనా అనే మహిళ, ఆమె కుటుంబ సభ్యులు అనాథ పిల్లలను బెదిరింపులకు గురిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న బాలికలపై ఈ దౌర్జన్యం జరగడం గమనార్హం. నిందితులు నేరుగా ఇంటి పైకి వచ్చి రాళ్లు, కర్రలతో భీభత్సం సృష్టించారు. అడ్డుకోవడానికి వెళ్లిన బంధువులపై సోనా కుటుంబ సభ్యులు విచక్షణారహితంగా దాడి చేశారు. సోనా కుమారుడు చాకుతో వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన ఇద్దరి తలలు పగలడంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు, నిందితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read-Posters Unveil: ప్రతి ఆటో ఒక సందేశం.. హిందూత్వ చైతన్యమే లక్ష్యం- అందెల శ్రీరాములు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News