Homeతెలంగాణరంగారెడ్డిBonalu: ఎల్బీనగర్‌ ఖిల్లా మైసమ్మకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు.. వైభవంగా బోనాల వేడుకలు

Bonalu: ఎల్బీనగర్‌ ఖిల్లా మైసమ్మకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు.. వైభవంగా బోనాల వేడుకలు

ఎల్​బీనగర్​ (తెలుగుప్రభ): మహేశ్వరం నియోజకవర్గం ఎన్‌టీఆర్‌ నగర్‌ డివిజన్‌లోని ప్రసిద్ధ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఆషాఢ బహుళ ఏకాదశి సందర్భంగా నిర్వహించనున్న బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

- Advertisement -

lb nagar bonalu

ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్‌), టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్‌ చల్ల నర్సింహారెడ్డి, టీపీసీసీ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News