Homeతెలంగాణరంగారెడ్డిFire Accident: విద్యుత్ వైర్లు తగిలి క్రాకర్స్ లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

Fire Accident: విద్యుత్ వైర్లు తగిలి క్రాకర్స్ లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

Lorry Fire Accident: రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం పెంజర్ల గ్రామ పరిధిలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని శివకాశి నుంచి హైదరాబాద్‌కు బాణాసంచా లోడుతో వస్తున్న లారీ పెంజర్ల మీదుగా వెళ్తుండగా హై టెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/hyderabad-cp-sajjanar-warns-on-social-media-love-cheatings/

పెంజర్ల గ్రామ సమీపంలోని మాణిక్యమ్మగూడ వద్ద ప్రధాన రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగలగానే లారీలోని టపాసులు పెద్ద శబ్దాలతో పేలడం ప్రారంభించాయి. దట్టమైన పొగ వందల అడుగుల ఎత్తు వరకు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/prakash-raj-tweet-on-dhurandhar-2-movie-over-tollywood-reaction/

డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో లారీ నుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. మంటల ధాటికి లారీ పూర్తిగా ఆహుతైంది. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న కొత్తూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. భద్రతా దృష్ట్యా పోలీసులు ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News