Homeతెలంగాణరంగారెడ్డిTelugu Prabha Effect: కబ్జా స్కెచ్‌కు బ్రేక్‌.. ‘తెలుగు ప్రభ’ కథనంతో గోడలపై పేర్లు మాయం

Telugu Prabha Effect: కబ్జా స్కెచ్‌కు బ్రేక్‌.. ‘తెలుగు ప్రభ’ కథనంతో గోడలపై పేర్లు మాయం

గండిపేట్ (తెలుగు ప్రభ): ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. నార్సింగి సర్కిల్‌ పరిధిలోని పుప్పాల్‌గూడ, నెమలి నగర్‌లో ప్రభుత్వ భూమిని ఆనుకుని ఉన్న కాంపౌండ్‌ గోడలపై కొందరు ఆక్రమణదారులు తమ పేర్లు, ఫోన్‌ నంబర్లు రాసి భూమిపై హక్కు ఉన్నట్లుగా ప్రచారం చేసేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ‘ప్రభుత్వ గోడపైనే కబ్జా సంతకాలు పేర్లు’ అనే శీర్షికతో తెలుగు ప్రభ దినపత్రికలో ప్రచురితమైన కథనం అధికారుల దృష్టికి వెళ్లింది. స్పందించిన రెవెన్యూ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. గోడలపై రాసిన వ్యక్తుల పేర్లు, ఫోన్‌ నంబర్లను చెరిపివేసి, ఆ ప్రాంతం ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తెలియజేస్తూ గోడలపై హెచ్చరికాత్మక రాతలు రాశారు.

- Advertisement -

ప్రభుత్వ భూములపై అక్రమంగా హక్కులు సృష్టించుకునే ప్రయత్నాలను సహించబోమని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారికి చెక్‌ పడినట్లయింది.

తెలుగు ప్రభ కథనంతో అధికారుల స్పందన…

ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా ‘తెలుగు ప్రభ’ వెలుగులోకి తీసుకొచ్చిన అంశంపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత యంత్రాంగాన్ని స్పందించేలా చేసిన తెలుగు ప్రభ దినపత్రికకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ భూమిపై మళ్లీ ఎలాంటి ఆక్రమణ ప్రయత్నాలు జరగకుండా అధికారులు నిఘా పెట్టాలని, గతంలో గోడలపై పేర్లు ఫోన్‌ నంబర్లు రాసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News