Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన వేచిఉన్న స్థానికులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
బ్రేకులు ఫెయిల్ కావడమే కారణం: పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు జాతీయ రహదారిపై షాద్‌నగర్ పరిధిలోని శాతంరాయి వద్ద కొందరు ప్రయాణికులు రోడ్డు పక్కన బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చెరుకున్న శంషాబాద్ పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వాహనం బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also read-Crime: కన్నతల్లిని హత్య చేసిన కూతురు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

