HomeTop StoriesDouble Murder: 'అసలు వారినే లేకుండా చేస్తే'.. మొయినాబాద్‌ జంట హత్యల కేసులో విస్తుపోయే విషయాలు.!

Double Murder: ‘అసలు వారినే లేకుండా చేస్తే’.. మొయినాబాద్‌ జంట హత్యల కేసులో విస్తుపోయే విషయాలు.!

Moinabad Double Murder Case: మొయినాబాద్‌ జంట హత్యల కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆర్థిక సాయం చేసిన వారినే కడతేర్చాలని ప్లాన్‌ చేశారు దంపతులు. వారికి మరో వ్యక్తి సాయం చేశారు. మొత్తం 8 మందిని హత్య చేసేందుకు కుట్ర చేయగా.. వారిలో ఇద్దరు మరణించారు. మిగిలిన ఆరుగురు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. 

- Advertisement -

ఫామ్ హౌస్‌కి రప్పించి 

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ జంట హత్యల కేసులో నిందితులు అప్పు ఇచ్చిన మొత్తం 8 మంది మహిళలను చంపేందుకు ఘోరమైన ప్లాన్ వేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలైన కరీమా బేగం, ఆమె భర్త.. మరో వ్యక్తితో కలిసి అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. తాండూరు, పరిసర ప్రాంతాలను హత్యకు స్పాట్‌గా ఎంచుకున్నారు. ప్లాన్‌లో భాగంగానే వికారాబాద్ జిల్లాలో మిస్సింగ్ అయిన మహబూబ్ బేగం, ఆబిదా బేగం అనే ఇద్దరు మహిళలను మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్ సమీపంలోకి రప్పించి దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టినట్లు నిందితులు వెల్లడించారు. 

Also Read: https://teluguprabha.net/national-news/neet-ug-2026-paper-leak-parliamentary-committee-investigation/

ఇద్దరు మహిళలను చంపిన తర్వాత, నిందితులు మిగిలిన ఆరుగురు మహిళలను కూడా అదే ఫామ్‌హౌస్‌కు రావాలని ఫోన్ చేసి వివరాలు తెలిపారు. అయితే, ఆ ఆరుగురు మహిళలు పలు కారణాల చేత ఆ సమయానికి ఫామ్‌హౌస్‌కు వెళ్లలేదు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులకు ఈ జంట హత్యల ఉదంతం బయటపడటంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ ఆరుగురు మహిళలు.. తమకూ ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. 

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad-metro-new-coaches-beml-telangana-govt/

అసలు వారే లేకపోతే

ఆరుగురు మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. తాము వడ్డీలకు/ఫైనాన్స్‌కు డబ్బులు ఇచ్చే వ్యాపారం చేస్తుండేవారు. ఈ క్రమంలో కరీమా బేగం వారి దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకోగా.. సరైన సమయానికి చెల్లించలేదు. దీంతో అప్పు తిరిగి ఇవ్వాలని బాధితులు ఆమెపై ఒత్తిడి చేశారు. అప్పు తీర్చలేక అసలు ఆ అప్పు ఇచ్చిన వారినే లేకుండా చేస్తే సరిపోతుందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టారు. 

మరోవైపు ఈ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దీంతో భయంతో ప్రధాన నిందితురాలు కరీమా బేగం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం తాండూరు, మొయినాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News