Terrorist Medchal Arrest: మేడ్చల్‌లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాహీద్ ఖాన్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా అతను నిషేధిత ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: https://teluguprabha.net/telangana/medigadda-l-and-t-office-burnt-to-ashes/
మేడ్చల్‌లోని ఓ స్థానిక హోటల్‌లో జాహీద్ ఖాన్ కార్మికుడిగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఐఎస్‌ఐ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికల ద్వారా ఉగ్రవాద గ్రూపుల్లో చేరేందుకు ఇతను తీవ్రంగా ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. అరెస్ట్ సమయంలో నిందితుడి వద్ద నుంచి నకిలీ గుర్తింపు పత్రాలు, నకిలీ పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడికి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

