- టియుడబ్ల్యూజె బాలాపూర్ మండల్ నూతన కార్యవర్గం ఏర్పాటు
- బాలాపూర్ మండల్ అధ్యక్షుడుగా కే. మహిపాల్ రెడ్డి ఎన్నిక
బడంగ్ పేట్ ( తెలుగు ప్రభ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన ప్యూచర్ సీటిలో జర్నలిస్టులకు కేటాయిస్తున్న ఇండ్ల స్థలాలలో మొదటి ప్రాధాన్యత రంగారెడ్డి జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు అవకాశాలు కల్పించాలని టీయూడబ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి కోరారు. గురువారం బాలాపూర్ మండలం బడంగ్ పేట్ కేంద్రంలో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టియుడబ్ల్యూజె (ఐజేయు) బాలాపూర్ మండలం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ ప్యూచర్ సీటిలో హైద్రాబాద్ ప్రాంత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నందున, అదే ప్రాంతంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని గత 20 ఏళ్లుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్న అర్హులైనవారందరికీ ఇండ్ల స్థలాలను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అర్హులైన జర్నలిస్టులందరికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో కార్పొరేట్ అసుపత్రుల్లో పనిచేసే విధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో సహ టియుడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ కృషి చేస్తున్నారని దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. యూనియన్ ద్వారా గతంలో హెల్త్ ఫాలసీ గడువు ముగిసిందని త్వరలోనే యూనియన్ సభ్యులందరికి 5 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం త్వరలో కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. ఆరోగ్యభీమా, జీవిత భీమా గ్రూపులవారిగా చేసుకునేలా ప్రయత్నాలు కోనసాగించాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యలపై టియుడబ్ల్యూజె రాజీలేని పోరాటం చేస్తుందని టియుడబ్ల్యూజె జిల్లా అధ్యక్ష్య కార్యదర్శులు సలీం పాషా, మేకల సత్యనారాయణలు అన్నారు. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలపై తమ సంఘం నిరంతరం పనిచేస్తుందని అందులో భాగంగా అర్హులైన జర్నలిస్టులకు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందెలా కృషిచేస్తున్నామన్నారు. అనంతరం బాలాపూర్ మండలం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Also read: Tarnaka: తార్నాక ఫ్లైఓవర్‌పై మరమ్మతులు పూర్తి.. ఓయూ ట్రాఫిక్ పోలీసుల చర్యలు
టీయూడబ్ల్యూజే బాలాపూర్ మండలం నూతన కమిటీ కార్యవర్గం అధ్యక్షుడు కె.మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.జయంత్, కోశాధికారిగా సి.శ్రావణ్ కుమార్, ప్రధాన సలహాదారులుగా అనంతుల శ్రీనివాస్, సలహాదారులుగా ఎం.భుజంగారెడ్డి, ఎండి.నిజాముద్దీన్, భూపాల్, శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కే.శ్రీనివాస్ గౌడ్, ఎం.అమరేశ్వర్ రెడ్డి, ఆర్.రమేష్, సంయుక్త కార్యదర్శులు జి.శ్రీనివాస్, బొల్లంపల్లి రాంబాబు, కే.శ్రావణ్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, జిల్లాకార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మాజీ జిల్లా అధ్యక్షులు ఆనంతుల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి శశిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు పాండు యాదవ్, ఎలాక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు నర్సింహా, సంయుక్త కార్యదర్శులు దారుగుపల్లి సత్యనారాయణ, బొల్లంపల్లి ఆంజనేయులు, సూర్యనారాయణ, ఈసీ సభ్యులు సురేందర్, జంగయ్య, శేఖర్, కృష్ణ, రాజ్ కుమార్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని జర్నలిస్టుల హక్కుల రక్షణకు స్థానిక కమిటీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు.


