Tragedy Young men Died: పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకల అనంతరం స్నానం చేసేందుకు చెరువుకి వెళ్లిన ఇద్దరు యువకులు.. నీటిలో మునిగి మృతి చెందారు. మేడ్చల్ జిల్లా పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది.
Also Read: https://teluguprabha.net/gallery/vijay-rashmika-house-warming-and-vratam-photos-viral/
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధి విశ్వకర్మ కాలనీలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పంతులు చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు సాగర్(17), అభిషేక్(17) నీటిలో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

