Additional revenue of ₹1,408 crore generated through registrations: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ జోరుగా కొనసాగుతో్ంది, క్రయ విక్రయాల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగానే గత ఏడు నెలల్లొ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025తో పోలిస్తే 2026లో ఏడు నెలల్లో ప్రతి నెలా ఆదాయం పెరుగుతూ వచ్చింది. అమ్మకాలు, కొనుగోళ్లలో ఏ మాత్రం తగ్గుదల ఏమాత్రం లేదని ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయమే స్పష్టం చేస్తున్నది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడు నెలల్లో ఏకంగా రూ. 1,408 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. సాగు భూములు, వ్యవసాయేతర స్థలాలు, ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఏడాది ఏడు నెలల్లో ప్రభుత్వ ఖజానాకు రూ. 10,114 కోట్ల ఆదాయం రాగా..2025లో ఇదే సమయంలో రూ.8,706 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది ఆదాయ వృద్ధిలో స్పష్టమైన పెరుగుదల నమోదైంది. ప్రభుత్వ భూముల సవరణ ముందే ప్రకటించడంతో మే నెలలో రూ. 300 కోట్ల రాబడి పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జూన్, జులై నెలల్లోనూ అమ్మకాలు, కొనుగోళ్ల జోరు కొనసాగింది. భూముల విక్రయాలు తగ్గిపోయాయని, రియల్ ఎస్టేట్ రంగం మందగించిందని జరుగుతున్న విషప్రచారంలో వాస్తవం లేదని ఈ గణాంకాలు చెబుతున్నాయని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం భూముల రేట్లు పెంచినప్పటికీ రిజిస్ట్రేషన్ల ఆదాయంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని తెలుస్తోంది.
Also Read: GATE Exam: గేట్ 2027 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్.. ఈసారి కొత్తగా మారిన రూల్స్ ఇవే..!

