HomeTop StoriesTG Govt: తెలంగాణ హేట్‌ స్పీచ్‌ బిల్లుపై ప్రతిపక్షాల వ్యతిరేకత.. సెలెక్ట్‌ కమిటీకి సిఫార్సు

TG Govt: తెలంగాణ హేట్‌ స్పీచ్‌ బిల్లుపై ప్రతిపక్షాల వ్యతిరేకత.. సెలెక్ట్‌ కమిటీకి సిఫార్సు

Telangana Hate Speech Bill: సోషల్ మీడియాలో విద్వేష ప్రసంగాలు, పోస్టులు అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టింది. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం “తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగం- ద్వేషపూరిత నేరాల(నివారణ) బిల్లు, 2026” ను తీసుకొచ్చింది. కులం, మతం, భాష లేదా ప్రాంతం వంటి అంశాల ఆధారంగా సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రతిపక్షాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, పౌర హక్కుల పరిరక్షణపై చర్చల నేపథ్యంలో, ఈ బిల్లును ప్రభుత్వం తదుపరి పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/9-maoists-surrender-before-ap-dgp/

తెలంగాణ హేట్‌ స్పీచ్‌ బిల్లు ప్రకారం.. బహిరంగ ప్రసంగాలు, రాతలు, సోషల్ మీడియా పోస్టులు, డిజిటల్ మాధ్యమాల ద్వారా చేసే విద్వేషపూరిత ప్రచారాలన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది. మొదటిసారి నేరానికి పాల్పడితే ఏడాది నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50,000 వరకు జరిమానా విధించవచ్చు. నేరం పునరావృతమైతే రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా ప్రతిపాదించారు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులు నాన్-బైలబుల్తో పాటు విచారణార్హమైనవిగా పరిగణిస్తారు. ఈ చట్టం ప్రకారం అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించడానికి ప్రత్యేక అధికారులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. 

Also Read: https://teluguprabha.net/cinema-news/bengali-actor-rahul-arunoday-banerjee-died-by-drowning-while-shooting/

సమాజంలో శాంతిభద్రతలను కాపాడటానికి, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న విద్వేషాలను అరికట్టడానికి ఈ చట్టం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారు. ఇది వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమే కాకుండా, రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు ఉపయోగపడుతుందని విమర్శించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, కర్ణాటక తర్వాత ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News