HomeతెలంగాణHeatwaves in Telangana: బాబోయ్‌ ఇవేం ఎండలు..! వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆయా జిల్లాలకు రెడ్‌...

Heatwaves in Telangana: బాబోయ్‌ ఇవేం ఎండలు..! వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

Red alert for several districts in Telangana: తెలంగాణలో ఎండలు మండుతన్నాయి. తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఇవాళ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు నిజామాబాద్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే కానీ మధ్యాహ్నం సమయంలో బయటకి రావొద్దని హెచ్చరించింది.

- Advertisement -

Also Read: Balka Suman arrest: బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ అరెస్ట్.. నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు..!

తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్‌..

ఇదిలా ఉంటే, తీవ్రమైన ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలించే వార్త చెప్పింది వాతావరణ. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్‌ ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News