పినపాక, అక్టోబర్ 4 (తెలుగు ప్రభ): పినపాక మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కోడిరెక్కల రమేష్ తండ్రి గురుమూర్తి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇర్ప సంబశివరావు, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ, సీనియర్ నాయకులు దాట్ల వాసుబాబు, పటేల్ భద్రయ్య, సత్యనారాయణ, బుల్లిబాబు, పోలిశెట్టి సత్తిబాబు, వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ కొమరం నారాయణ, దొడ్డా శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ, దాట్ల మోహన్ రావు, రమేష్, కిరణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.

