Registration Stalled across Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్లు నిలిచిపోయాయి. దీంతో స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపుల వంటి సేవలకు బ్రేక్ పడింది. కాగా, స్టేట్ డేటా సెంటర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల సర్వర్లు పనిచేయడం లేదని రిజిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/top-stories/supreme-court-sensational-verdict-on-religious-conversion/
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అంతరాయం వల్ల స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, చలాన్ల చెల్లింపులు, ఈ-కేవైసీ ప్రక్రియ, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు, వివాహ రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోయాయి. ఉదయం నుంచి సర్వర్లు మొరాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద క్రయవిక్రయదారులు, సాక్షులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాంకేతిక బృందాలు లోపాన్ని సరిచేసే పనిలో ఉన్నాయని, సాయంత్రం లోపు సేవలు పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రేపు కార్యాలయాలకు వెళ్లేవారు ముందుగా అధికారిక IGRS తెలంగాణ పోర్టల్‌లో సర్వీసుల స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించారు.

