HomeతెలంగాణTG News: రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌లు.. ఇక వారికి రేపే ఛాన్స్‌.!

TG News: రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌లు.. ఇక వారికి రేపే ఛాన్స్‌.!

Sub Registrar Server Down: తెలంగాణ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాత సర్వర్‌ సాంకేతిక లోపంతో ఈ రోజు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కాసేపటి క్రితమే సర్వర్‌ను పునరుద్ధరించారు. స్టేట్ డేటా సెంటర్ చేసిన కొన్ని మార్పుల వల్ల సర్వర్లపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి దాదాపు 4-5 బృందాలు శ్రమించి సమస్యను పరిష్కరించడంతో ప్రస్తుతం సర్వర్లు యథాతథంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/womens-reservation-bill-defeated-in-lok-sabha/

ఈ క్రమంలో ఈ రోజు స్లాట్‌లు బుక్ చేసుకుని, సర్వర్ సమస్య వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన వారికి శనివారం ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్లకు అనుమతి ఇచ్చారు. కాగా, పాత సర్వర్లు మాటిమాటికీ మొరాయిస్తుండటంతో, కొత్త సర్వర్‌ను కొనుగోలు చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే టెండర్లు పిలిచింది.

Also Read: https://teluguprabha.net/cinema-news/chiyaan-vikram-announced-his-new-movie-on-his-birthday/ 

ఈ అంతరాయం కారణంగా స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపు, భూ బదలాయింపు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయాల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News