HomeTop StoriesRevanth Reddy: బిగ్‌ అలర్ట్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత.. సీఎస్‍కు సీఎం కీలక ఆదేశాలు

Revanth Reddy: బిగ్‌ అలర్ట్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత.. సీఎస్‍కు సీఎం కీలక ఆదేశాలు

Revanth Reddy key instructions to CS: తెలంగాణలో తీవ్రమైన వడగాల్పులు, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లా కలెక్టర్లకు తగిన దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు.

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, సూచనలు..

వైద్య సిబ్బందికి అలర్ట్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHCs) నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు వైద్యులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలి.

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు: ఎండదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు అన్ని కేంద్రాల్లో తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలి.

ప్రత్యేక వైద్యం: వడదెబ్బ తగిలి ఆసుపత్రులకు వచ్చే బాధితులకు తక్షణమే అవసరమైన అత్యవసర చికిత్స అందించాలి.

తాగునీరు, విద్యుత్: ఎండల దృష్ట్యా తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి.

చలివేంద్రాల ఏర్పాటు: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో ప్రజల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి.

ఉత్తర తెలంగాణకు అలర్ట్: ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

మధ్యాహ్నం ప్రయాణాలు వద్దు: తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News