HomeTop StoriesCM Revanth Reddy: తుమ్మిడిహట్టిపై చర్చించేందుకు సిద్ధం.. డేట్ ఫిక్స్ చేయండి.. ఫడ్నవిస్‌కు సీఎం లేఖ

CM Revanth Reddy: తుమ్మిడిహట్టిపై చర్చించేందుకు సిద్ధం.. డేట్ ఫిక్స్ చేయండి.. ఫడ్నవిస్‌కు సీఎం లేఖ

Revanth Reddy letter to Maharashtra CM: తుమ్మిడిహట్టి బ్యారేజీ అంశంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ వ్యవహారంలో మహారాష్ట్రతో చర్చించేందుకు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రతినిధులకు తమ వాదన వినిపించేందుకు తగిన సమయం ఇవ్వాలని.. భేటీకి తేదీ ఖరారు చేయాలని కోరారు. గతంలో 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌కు (ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌) మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశారు. అయితే, దీని ద్వారా ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరవని రేవంత్‌ స్పష్టం చేశారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీళ్లొస్తాయని వివరించారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ పెంచినా.. మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువేనని రేవంత్‌రెడ్డి వివరించారు. అందువల్ల, ఇరు రాష్ట్రాలకు చెందిన రైతులకు మంచి జరగాలంటే ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవల్‌ పెంచాలని విజ్ఙప్తి చేశారు.

- Advertisement -

Also read: Peddi Movie: తెలంగాణలో రెంటల్‌ విధానంలోనే పెద్ది ప్రదర్శన.. మెగాస్టార్‌ జోక్యంతో వివాదానికి ఎండ్‌కార్డ్‌..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News