Tuesday, February 10, 2026
HomeతెలంగాణRevanth Reddy OU Visit : హైటెన్షన్.. మరికాసేపట్లో ఉస్మానియాకు సీఎం రేవంత్

Revanth Reddy OU Visit : హైటెన్షన్.. మరికాసేపట్లో ఉస్మానియాకు సీఎం రేవంత్

Revanth Reddy OU Visit : హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో సీఎం రేవంత్ రెడ్డి నేడు సందర్శనకు రానున్న తరుణంలో క్యాంపస్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగుల నిరసనలు జరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇనుప కంచెలు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో క్యాంపస్‌ను ముట్టడి చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

ALSO READ: Smart Ration Cards : ఏటీఎం తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులు

ఇక ఈ భద్రతా చర్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రేవంత్ రెడ్డి ఇనుప కంచెల మధ్యే పర్యటించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, కంచెలు లేకుండా రావాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు.

ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి ఓయూలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రూ.80 కోట్లతో నిర్మించిన రెండు కొత్త హాస్టళ్లను (1200 విద్యార్థులకు వసతి) ప్రారంభిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో 300 మందికి వసతి కల్పించే హాస్టళ్ల శంకుస్థాపన, రూ.10 కోట్లతో డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ నిర్మాణ భూమిపూజ కూడా జరుగనున్నాయి. టాగూర్ ఆడిటోరియంలో “తెలంగాణ విద్యా రంగంలో మార్పులు” అనే అంశంపై ప్రసంగిస్తారు.

20 ఏళ్ల తర్వాత ఓయూ సందర్శించే తొలి సీఎం‌గా రేవంత్ నిలుస్తున్నారు. అయితే, ఓయూలో 1400 టీచింగ్, 2300 నాన్‌టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉనడం, భూమి కబ్జా సమస్యలపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల నిరసనలు రాజకీయ రంగంలో కీలకమైన చర్చను ఆరంభించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News