HomeతెలంగాణRevanth Reddy: సీఎం రేవంత్‌ 20 రోజుల ఫారిన్‌ టూర్

Revanth Reddy: సీఎం రేవంత్‌ 20 రోజుల ఫారిన్‌ టూర్

Revanth Reddy:తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరో ఫారిన్‌ టూర్‌ కి సిద్ధమవుతున్నారు. దాదాపు 20 రోజులు అంటే ఆగస్ట్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు అమెరికాతో పాటు యూకే, మరికొన్ని దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

- Advertisement -

యూకే పర్యటనలో సీఎం..

యూకే పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, రక్షణ తయారీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు. లండన్‌లో పెట్టుబడిదారులు, విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

గత విదేశీ పర్యటనల్లో కుదిరిన ఎంవోయూల అమలు పురోగతిని సమీక్షించే అవకాశం ఉంది. తెలంగాణ రైజింగ్ 2047, ఫ్యూచర్ సిటీ, జీసీసీలు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రణాళికలను వివరించనున్నారు.

Also Read: IMD: రైతన్నలకు చేదు కబురు…ఆగస్టు..సెప్టెంబర్‌ లో వర్షాలు లేవు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News