HomeతెలంగాణEducation : నేను విద్యాశాఖకు ఎందుకు రాజీనామా చేయాలి? :సీఎం రేవంత్ రెడ్డి

Education : నేను విద్యాశాఖకు ఎందుకు రాజీనామా చేయాలి? :సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy Education Department Reforms : తెలంగాణ విద్యావ్యవస్థలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు నిలయాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని ఇటీవల ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేసిన ఉపాధ్యాయుల బృందంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశమయ్యారు..  ఈ సందర్భంగా సీఎం చేసిన పలు కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

- Advertisement -

పక్షాల విమర్శలకు సూటి ప్రశ్నలు – దిమ్మతిరిగే కౌంటర్ : విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “నేను విద్యాశాఖకు ఎందుకు రాజీనామా చేయాలి? ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అల్పాహారం అందించినందుకా? ఐటీఐ (ITI)లను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ATC) తీర్చిదిద్దినందుకా? లేక ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా పూర్తి చేసినందుకా?” అని ప్రశ్నించారు. విమర్శలు చేసేవారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. నర్సరీ చదివే చిన్నారి తనకు ఓటు వేయడని, ఓట్లు తెచ్చిపెట్టే ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల శాఖలను కాదని, కేవలం తెలంగాణ పిల్లల భవిష్యత్తు కోసమే తాను విద్యాశాఖను స్వీకరించానని స్పష్టం చేశారు.

ఏడాదికి 10-12 మంది ఉపాధ్యాయులకు విదేశీ శిక్షణ : ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం తెలిపారు.. ప్రపంచంలోనే అత్యుత్తమంగా పేరొందిన ఫిన్లాండ్, జర్మనీ విద్యా విధానాలను తెలంగాణలో అమలు చేసేందుకు ఉపాధ్యాయుల మార్పిడి (Teacher Exchange) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు.
ఏడాది అధ్యయన లీవ్: ప్రతి ఏడాది 10 నుంచి 12 మంది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను విదేశాలకు పంపిస్తామని వెల్లడించారు.

పూర్తి ఆర్థిక సాయం: విదేశీ విద్య, అధ్యయనానికి కావలసిన నిధులతో పాటు ఒక సంవత్సరం పాటు పూర్తి జీతంతో కూడిన సెలవును (Leave with pay) ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే కచ్చితంగా ఉద్యోగం, ఉపాధి వస్తుందనే నమ్మకాన్ని విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని సూచించారు.

 ‘2034 దాకా తానే సీఎం’ – స్థిరమైన పాలనకు హామీ : రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంపై వస్తున్న పుకార్లకు సీఎం రేవంత్ రెడ్డి తెరదించారు. “2034 వరకు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటను. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు, డౌట్లు అవసరం లేదు” అని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వహణలో మానవత్వంతో వ్యవహరిస్తున్నామని, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంక్షేమమే తమ ప్రాధాన్యమని పేరొన్నారు

తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. “నేను కూడా ప్రభుత్వ బడిలోనే చదువుకున్నాను. చిన్నప్పుడు బడిలో చదువుకుని ఏమవుతావని అడిగితే సీఎం అవుతానని చెప్పాను, ఈ రోజు సీఎం అయ్యాను” అని పేర్కొని బడిపిల్లల్లో స్ఫూర్తి నింపారు.


కిందిస్థాయి నుంచే ఆదేశాలు  – టీచర్ల సమస్యలకు నాదే బాధ్యత :  విద్యా వ్యవస్థలో సంస్కరణలు పైనుంచి రుద్దేవిగా కాకుండా, క్షేత్రస్థాయి నుంచి రావాలని సీఎం అభిప్రాయపడ్డారు.మండల స్థాయి ప్రణాళికలు: ప్రతి మండలంలో విద్యాభివృద్ధికి ఏం కావాలో స్థానిక ఉపాధ్యాయులే సలహాలు, సూచనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

సులభమైన పరిష్కారం: ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం చాలా తేలికైన విషయమని, కానీ ఉపాధ్యాయుల బదిలీలు, సమస్యల పరిష్కారం సున్నితమైనదని, ఆ బాధ్యతలను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పారు.


జీతాల చెల్లింపులు: గత ప్రభుత్వాల హయాంలో జీతాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కానీ 2024 జనవరి నుంచి ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నామని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News