Raithu Bharosa Funds Rabi Season: రైతు భరోసా సాయం కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఎన్నికల కారణంగా అన్నదాతల ఖాతాల్లోకి ఆర్థిక సాయం జమ చేయడం ఆలస్యమైన విషయం తెలిసిందే. దీంతో అన్ని అడ్డంకులు తొలగి రైతు భరోసాకి మార్గం సుగమమైంది.
Also Read: https://teluguprabha.net/telangana/ktr-response-on-moinabad-drugs-case/
తెలంగాణ రైతులకు సర్కార్ శుభవార్త అందించింది. ఈనెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తొలి విడతలో భాగంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 3,590 కోట్ల నిధులు బదిలీ చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో తొలి విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.

