TRS Chief Kavitha: తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు సమన్లు జారీ చేసింది. కొంతకాలం క్రితం కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమం కేసులో బుధవారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
Also Read: https://teluguprabha.net/national-news/vijay-meets-with-aidmk-rebel-mlas/
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కవిత ఆధ్వర్యంలో రైల్ రోకో కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. రైల్ రోకోతో నిజామాబాద్– హైదరాబాద్ రూట్‌లో అంతరాయం ఏర్పడటంతో.. రైల్వే రవాణాకు అంతరాయం కలిగిందని ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు చేశారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు గూడ్స్ రైలు నిలిపివేతపై పలు సెక్షన్ల కింద కవితపై కేసు నమోదైంది. ఈ క్రమంలో రేపు ఉదయం 10:30కి విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: https://teluguprabha.net/business/stock-markets-are-in-downfall-today/
ఈ కేసులో కవితతో పాటు మరో 12 మంది నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. రైల్వేచట్టాల ఉల్లంఘన, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.

