HomeతెలంగాణShamirpet Tahsildar: రూ. 2 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి పట్టుబడ్డ శామీర్‌పేట్ తహసిల్దార్‌

Shamirpet Tahsildar: రూ. 2 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి పట్టుబడ్డ శామీర్‌పేట్ తహసిల్దార్‌

Shamirpet Tahsildar arrested by ACB: రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగళం బయటపడింది. భూ సమస్య పరిష్కారానికి ఓ రైతు నుంచి రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్‌ సుచరిత ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ రైతు తన భూ సమస్య పరిష్కారించాలని వేడుకోగా తహసీల్దార్‌ లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సదరు రైతు తహసిల్దార్‌కు రూ. 2 లక్షల లంచం ఇచ్చేందుకు సిద్ధమవ్వగా.. ఆ డబ్బు తన డ్రైవర్‌కి ఇవ్వాలని ఆమె సూచించారు. దీంతో, సదరు రైతు రూ. 2 లక్షల నగదును నేరుగా డ్రైవర్‌ చేతిలో పెట్టాడు. అనంతరం, డ్రైవర్‌ ఆ డబ్బు తీసుకెళ్లి తహసీల్దార్‌ సుచరితకు అందించాడు. దీంతో, ఏసీబీ అధికారులు తహసీల్దార్‌తో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Also read: Bandi Bhagirath: బండి భగీరథ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్‌సిగ్నల్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News