Singer Mangli approach Court: ప్రముఖ గాయని మంగ్లీ తనపై జరుగుతున్న ఉద్దేశపూర్వక అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనకు ఏమాత్రం సంబంధం లేని మైక్రో ఫైనాన్స్ వివాదంలో తన పేరును లాగుతూ.. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని మీడియా సంస్థలు మరియు వ్యక్తులు వ్యవహరిస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఎదుగుదలను ఓర్వలేకనే తప్పుడు ప్రచారం: పథకం ప్రకారం కొందరు వ్యక్తులు తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ పరువు నష్టం కలిగిస్తున్నారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై ఉన్న అభ్యంతరకర వీడియోలను వెంటనే తొలగించాలని ఆమె కోర్టును కోరారు. తన ఎదుగుదలను ఓర్వలేకనే తనపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు. కొందరు వ్యక్తులు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
Also read- Karimnagar: కరీంనగర్‌లో హైటెన్షన్.. పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నం!
పలువురికి నోటీసులు జారీ చేసిన కోర్టు: మంగ్లీ దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్ట్ విచారణకు స్వీకరించింది. అనంతరం ప్రాథమిక ఆధారాలను పరిశీలించి కీలక ఆదేశాలు జారీ చేసింది. రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డిలతో పాటు పలు మీడియా మరియు డిజిటల్ మీడియా సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. భవిష్యత్తులో మంగ్లీపై ఎటువంటి అసత్య ప్రచారాలు చేయకూడదని ఆదేశించింది. మంగ్లీపై ఇప్పటివరకు ఉన్న అభ్యంతరకర కంటెంట్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు పేర్కొంది. తనకు సంబంధం లేని విషయాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేస్తున్న వారిపై న్యాయపోరాటం చేస్తానని ఈ సందర్భంగా మంగ్లీ స్పష్టం చేశారు.

