SIR deadline extended: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువును ఆగస్టు 10 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 24న ముగియాల్సిన గడువును ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించింది. దీని ప్రకారం, ఆ గడువు ఆగస్టు 3న ముగియాల్సి ఉంది. అయితే, ఇంకా చాలా చోట్ల ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించకపోవడంతో మరోసారి గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలను సబ్‌మిట్ చేసేందుకు అవకాశం కల్పించింది. కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 77.12 శాతం ఎన్యూమరేషన్ పూర్తయిందని ఈసీఐ తెలిపింది. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 56.31 శాతం, రంగారెడ్డిలో 63.43, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించింది.
Also Read: Mahankali temple: భక్తులతో కిక్కిరిసిన మహంకాళి ఆలయం.. బోనాలతో పోటెత్తిన భక్తజనం

