MLAs disqualification Petition: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ శనివారం ముగిసింది. శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్‌పై స్పీకర్ విచారణ ముగియగా తీర్పు రిజర్వ్ చేసింది. త్వరలోనే దానం, కడియం అనర్హత పిటిషన్లపై శాసన సభాపతి తీర్పు వెలువడనుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన అనర్హత పిటిషన్‌పై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ముగించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం స్పీకర్ తన తీర్పును రిజర్వ్ చేశారు. కాగా, అంతకుముందే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్‌పై కూడా విచారణ ముగిసిన విషయం తెలిసిందే. కడియం విషయంలోనూ తీర్పు రిజర్వ్‌లో ఉంచారు.
Also Read: https://teluguprabha.net/telangana/130-maoists-surrender-before-cm-revanth-reddy/
2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలతో పది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. అయితే సాక్ష్యాధారాలు లేవంటూ 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై , సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణను స్పీకర్ వేగవంతం చేసి ముగించారు. వీరి భవితవ్యంపై స్పీకర్ మరికొద్ది రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

