Sri Chaitanya School: అమెరికా నాసా ఏన్‌ఎస్‌ఎస్ (NASA NSS) స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2026లో శ్రీ చైతన్య స్కూల్ వరుసగా 15వ సారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి విజయ దుందుభి మ్రోగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీలో మొత్తం 31 దేశాలు పాల్గొన్నాయి. మొత్తం 134 విన్నింగ్ ప్రొజెక్టులు ప్రకటించగా.. అందులో భారతదేశం 80 అవార్డుల సాధించింది. ఈ 80 అవార్డులలో అత్యధికంగా 57 అవార్డులను ఒక్క శ్రీ చైతన్య విద్యార్థులే గెలుచుకున్నారు. ఇది భారతదేశం సాధించిన మొత్తం ఫలితాలలో 71 శాతం. శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమ మాట్లాడుతూ ప్రపంచంలో ఈ ఘనతను సాధించిన ఏకైక విద్యాసంస్థ శ్రీ చైతన్య మాత్రమేనని తెలిపారు. ఇప్పటివరకు మరే ఇతర సంస్థ కూడా ఈ మైలురాయిని చేరుకోలేదని ఆమె తెలిపారు.
శ్రీ చైతన్యకు మాత్రమే సాధ్యం: అదేవిధంగా మొత్తం 57 విన్నింగ్ ప్రాజెక్టులను కేవలం శ్రీ చైతన్య మాత్రమే సాధించిందని అన్నారు. వీటిలో ప్రపంచస్థాయిలో 16 ప్రైజ్ 6 ప్రాజెక్టులు, 2nd ప్రైజ్ 11 ప్రాజెక్టులు, 3rd ప్రైజ్ 10 ప్రాజెక్టులు మరియు Honourable Mentions 30 ప్రాజెక్టులు ఉన్నాయని ఆమె వివరించారు. ఈ 57 విన్నింగ్ ప్రాజెక్టులలో 549 మందికి పైగా విద్యార్థులు పాల్గొని విజయం సాధించారని ఆమె పేర్కొన్నారు.
ప్రపంచస్థాయిలో 1st, 2nd, 3rd ప్రైజ్‌ల సంఖ్యలోనైనా: విన్నింగ్ ప్రాజెక్టుల సంఖ్యలోనైనా లేదా ప్రాజెక్టులలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యలోనైనా .. శ్రీ చైతన్య స్కూల్ సాధించిన ఫలితాలకు ప్రపంచంలో గానీ, భారతదేశంలో గానీ మరే ఇతర విద్యా సంస్థ కూడా దరిదాపుల్లో కూడా లేదని శ్రీ చైతన్య డైరెక్టర్ సీమ అన్నారు. ఇంతటి ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు ఇతర సిబ్బందికి డైరెక్టర్ సీమ అభినందనలు తెలియజేశారు.ప్రపంచంలో మిగిలిన 30 దేశాలు మొత్తం విన్నింగ్ ప్రాజెక్టులు 54 గెలుచుకోగా భారతదేశం నుండి ఒక్క శ్రీ చైతన్య మాత్రమే 57 విన్నింగ్ ప్రొజెక్టులు సాధించడం దేశానికే గర్వకారణమని డైరెక్టర్ సీమ ఈ సందర్భంగా తెలియజేశారు.

