Sridhar Babu Comments on Harish Rao: బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా? వద్దా? అనేది ఆయనే చెప్పాలన్నారు. ‘‘ఫ్యూచర్ సిటీపై ఇలా అసత్య ప్రచారం చేస్తే పెట్టుబడులు రావు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తాయి. ఫ్యూచర్ సిటీలో కాలుష్యకారక పరిశ్రమలు ఉండవు. దాన్ని రద్దు చేస్తామనడం ఎంత వరకు సమంజసం?’’ అని హరీష్ రావును సూటిగా ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీఆర్‌ఎస్ అడ్డుకుంటోందని మంత్రి ఆరోపించారు. ఆ పార్టీ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు తెర తీసిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటిరోజు నుంచే బీఆర్‌ఎస్ నేతలు విమర్శలే ప్రధాన అంశంగా ముందుకెళ్తున్నారని, జంట నగరాలకు సంబంధించిన మెట్రోను విస్తరించాలనుకుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Sridhar Babu: ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామనడం అవివేకం.. హరీష్ రావుకు మంత్రి శీధర్ బాబు కౌంటర్
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

