Star Hospitals excellent book on joint pain solutions: అన్ని వయసుల వారు తమ కండరాలను రక్షించుకోవడానికి, నొప్పి లేని జీవితాన్ని ఆస్వాదించడానికి ‘ది హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్డ్’ అనే ఉచిత ప్రజారోగ్య పుస్తకాన్ని స్టార్ హాస్పిటల్స్ విడుదల చేసింది. 25 ఏళ్లకు పైగా రోబోటిక్, ఆర్థోపెడిక్ విశిష్టమైన అనుభవం గల డాక్టర్ నీలం వి. రమణ రెడ్డి రాసిన ఈ పుస్తకాన్ని స్టార్ హాస్పిటల్ బంజారాహిల్స్‌లో ఆవిష్కరించారు. కీళ్లను కాపాడుకోవడానికి, వైద్య పరమైన అపోహలను తొలగించడానికి, శస్త్రచికిత్స అవసరం లేకుండా కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన సూచనలను ఈ పుస్తకంలో వివరించారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కీళ్ల క్షీణతను అరికట్టడమే లక్ష్యంగా ఈ పుస్తకాన్ని రచించారు.
బంజారాహిల్స్ స్టార్ ఆసుపత్రిలో ఆవిష్కరణ..
నేటి శారీరక శ్రమ లేని జీవనశైలి, సరైన విధానం లేని కూర్చునే పద్ధతులు, మారుతున్న జీవన పరిస్థితుల వల్ల చిన్న వయసులోనే కీళ్ల క్షీణత ఆందోళనకరంగా మారుతోంది. ఈ క్రమంలో, స్టార్ హాస్పిటల్స్ ఒక సమగ్ర ప్రజారోగ్య కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించింది. దీనికి “ది హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్డ్ ది అల్టిమేట్ గైడ్ టు జాయింట్ హెల్త్ అండ్ కేర్” అని పేరు పెట్టింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్స్ 5వ అంతస్తు ఆడిటోరియంలో 4 జూన్ 2026 నేటి (గురువారం) ఉదయం 11:30 గంటలకు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఈ పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్స్‌లో రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ నీలం వి. రమణ రెడ్డి రచించారు. ఈ పుస్తకంలో ప్రాథమిక వైద్య సూచనలు, వివిధ కేసుల పరిశీలనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. సంక్లిష్టమైన కీళ్ల కండరాల పనితీరును సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే భాషలో ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేలా స్టార్ హాస్పిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 25 ఏళ్ల ఆర్థోపెడిక్ అనుభవంతో రాసిన ఈ పుస్తకం, దశాబ్దాల క్లినికల్ అనుభవాన్ని ఆచరణాత్మకమైన, నిజ జీవిత మార్గదర్శకత్వంగా నిలుస్తుందని డాక్టర్ నీలం రమణ రెడ్డి అభిప్రాయపడ్డారు. కీళ్లకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ పుస్తకంలో వివరించినట్లు చెప్పారు.
పెరుగుతున్న కీళ్ల సమస్యలు, వాటికి పరిష్కారాలు..
గతంలో కీళ్ల నొప్పులు వృద్ధాప్య కాలంలోనే వచ్చేవి. ఈ మధ్య కాలంలో యువతను సైతం కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. కీళ్ల క్షీణత వేగంగా యువకులను సైతం ప్రభావితం చేస్తోంది. ఆఫీసుల్లో ఎక్కువ గంటలు కూర్చుని పనిచేయడం, కనీస శారీరక శ్రమ లేకపోవడం, పట్టణ ప్రాంతాల్లో కూర్చునే పద్ధతిలో లోపాలు, పెరుగుతున్న ఊబకాయం రేట్ల వల్ల 30 నుంచి 40 ఏళ్ల వయసు వారిలోనూ కార్టిలేజ్ (కీళ్ల మృదులాస్తి) పలచబడటం, తీవ్రమైన కీళ్ల అరుగుదల సమస్య వస్తోంది. మారుతున్న జీవనశైలి, పట్టణీకరణ, పెరుగుతున్న ఆయుర్దాయం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ ఆందోళన మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి కండరాల, అస్థిపంజర రుగ్మతలతో పాటు కీళ్ల కదలికలకు సంబంధించిన ఆరోగ్య సవాళ్లను పెంచుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థరైటిస్, కీళ్ల క్షీణతకు గురయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆర్థోపెడిక్ నిపుణులు చెబుతున్నారు. ఈ సంక్షోభంపై సామాజిక-ఆర్థిక ప్రభావం తీవ్రంగా ఉందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.71 బిలియన్ల మంది ప్రజలు కండరాల, కీళ్ళ సమస్యలతో బాధపడుతుండగా.. ఇది వైకల్యానికి ప్రధాన కారణంగా మారింది. దేశంలో మోకాలి అరుగుదల (ఆస్టియో ఆర్థరైటిస్) అత్యంత వేగంగా పెరుగుతున్న దీర్ఘకాలిక సమస్యల్లో ఒకటిగా ఉంది. ఇది వ్యక్తిగత వృత్తిని మాత్రమే కాకుండా మొత్తం కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కుటుంబంలో ప్రధానంగా సంపాదించే వ్యక్తి లేదా సంరక్షకుడు నడవలేని స్థితిలోకి వెళ్లినప్పుడు, వారిపై మానసిక, ఆర్థిక భారం పడుతోంది. ప్రతి ఏటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి వేలాది మంది రోగులు కీళ్ల రుగ్మతల చికిత్స కోసం ఆర్థోపెడిక్ నిపుణులను కలుస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులపై మరింత అవగాహన, నివారణ చర్యలు, సకాలంలో వైద్య సహాయానికి సంబంధించిన అత్యవసర అవసరాన్ని నొక్కి చెబుతుంది.
అవగాహన & నివారణే అత్యుత్తమ మార్గం..
“కదలిక అనేది ప్రాణశక్తికి మూలం. జీవించడం అంటే కదలడం, కదలడం అంటే జీవించడం. ఒక కీలు దశాబ్దాల పాటు మన్నికగా ఉండాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. శస్త్ర చికిత్స అవసరం లేకుండానే కీళ్ల నొప్పులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.” అని డాక్టర్ నీలం వి. రమణారెడ్డి పేర్కొన్నారు. కీళ్ల నొప్పుల నివారణపై అవగాహన కల్పించడంతో పాటు ఫిజియోథెరపీ, సాంప్రదాయ సంరక్షణ పద్ధతుల ద్వారా కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చనే విషయాన్ని ఈ పుస్తకంలో వివరించారు.
పుస్తకంలో పేర్కొన్న ప్రధాన అంశాలివే..
1. కీళ్ల నొప్పులకు గల కారణాలు
కార్టిలేజ్, సైనోవియం, లిగమెంట్లు, టెండన్ల సరళమైన వివరణ – కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయనే విషయాన్ని పుస్తకంలో వివరించారు.
2. కీళ్ల నొప్పులకు పరిష్కారాలు
సమతుల బరువు, ఒమేగా-3 సమృద్ధిగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్, కూర్చునే, నిలబడే పద్ధతుల సవరణ, తక్కువ ప్రభావం చూపే వ్యాయామాల (ఈత, సైక్లింగ్)లతో కీళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు అని వివరించారు.
3. ప్రజల్లో ఉన్న అపోహల తొలగింపు
కీళ్ల నొప్పులపై అపోహలు, భయాలను తొలగించి.. ప్రజలకు వాస్తవాలను వివరించడం. వేళ్లు విరవడం వల్ల ఆర్థరైటిస్ రాదని నిరూపించడం. ఆధునిక కీళ్ల మన్నిక 20 నుండి 25 సంవత్సరాలకు పైగా ఉంటుందని వివరించారు.
4. రోబోటిక్ శస్త్రచికిత్సతో పరిష్కారం
రోబోటిక్ శస్త్రచికిత్స ఖచ్చితత్వం, వేగవంతంగా కోలుకునే మార్గాలను పరిచయం చేయడం, శస్త్ర చికిత్సలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర గురించి వివరించారు.
స్టార్ హాస్పిటల్ వెబ్‌సైట్‌లో ఉచితంగా అందుబాటులోకి..
హైదరాబాద్‌లోని స్టార్ సెంటర్ ఫర్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్ కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చక్కటి పరిష్కారం చూపుతోంది. రోబోటిక్ చికిత్స పద్ధతుల ద్వారా సులభంగా కీళ్ల నొప్పులకు చెక్ పెడుతోంది. అధునాతన వైద్య పరిజ్ఞానం కేవలం ఆసుపత్రి గోడలకే పరిమితం కాకుండా, అందరికీ అందుబాటులోకి తీసుకొస్తోంది. కీళ్ల నొప్పులపై ముఖ్యమైన వివరాలను ఒకే పుస్తకంలో పొందుపరిచి పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయం. ఇవాళ జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభలో ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వైద్య నిపుణులు, ఆసుపత్రి మేనేజ్‌మెంట్, మీడియా ప్రతినిధులు, రోగులు, విశిష్ట అతిథులు పాల్గొన్నారు. కాగా, ఈ పుస్తకం ఉచితంగా అందుబాటులో ఉంది. దీన్ని స్టార్ హాస్పిటల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

