TGPSC Group 1 Supreme Court: తెలంగాణలో గ్రూప్-1 నియామకాల్లో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్‌ను గురువారం డిస్మిస్ చేసిన ధర్మాసనం.. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. నియామక ప్రక్రియను సమర్థిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధ్రువీకరించింది.
Also Read: https://teluguprabha.net/telangana/mla-harish-rao-comments-on-union-minister-kishan-reddy/
ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) చేపట్టిన 563 గ్రూప్-1 పోస్టుల నియామక ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని, మూల్యాంకనంలో తప్పులున్నాయని, నోటిఫికేషన్‌ను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కొంతమంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. అంతకుముందు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్, పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొంటూ నియామక ప్రక్రియకు అనుమతించింది. ఈ తీర్పులో జోక్యం చేసుకోవడానికి తగిన ఆధారాలు లేవని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Also Read: https://teluguprabha.net/telangana/poultry-owners-clarity-on-chicken-retailers-strike/
అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, పారదర్శకత కోసం మూల్యాంకనాన్ని మూడుసార్లు నిర్వహించినట్లు కమిషన్ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ గ్రూప్-1 ఎంపికైన అభ్యర్థుల నియామక ప్రక్రియకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

