Homeతెలంగాణకరీంనగర్Siricilla: సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్‌పై వీడని ఉత్కంఠ

Siricilla: సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్‌పై వీడని ఉత్కంఠ

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి,  (తెలుగు ప్రభ): నామినెట్‌ పదవులలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది పీసీసీ అధిష్టానం యోచిస్తున్నది. అధిష్టాన నిర్ణయాన్ని శిరసా వహిస్తూ ఓసీ నేతలంతా అంగీకారం తెలిపినా, బీసీ నేతలే ససేమిరా అంగీకరించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. నేతల తీరును ఎండగడుతూ సోషల్‌ మీడియాలో కొందరు కార్యకర్తలు పెట్టిన పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో ఇటీవలే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు నామినెట్‌ పోస్టులను అధిష్టానం ప్రకటించింది. అందులో కేవలం సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్‌ స్తానం పెండింగ్‌లో పెట్టింది. అందుకు గల కారణాలు నేతల మధ్య సయోధ్య లేకపోవడమేనని అంటున్నారు. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట ఎస్సీ, వీర్నపల్లి బీసీ మహిళ, ముస్తాబాద్‌ ఓసీ, గంభీరావుపేట మైనార్టీకి మార్కెట్‌ కమిటీ స్థానాలకు చైర్మన్లను ప్రకటించింది. సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ స్థానం మొన్నటి వరకు ఓసీ అభ్యర్థినీ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డికి కెటాయించారు. ఆమె పదవీ కాలం పూర్తయినందున ఖాళీ అయిన ఆస్థానాన్ని బీసీకి కేటాయించాలంటూ.. ఓసీ నాయకులు కొందరు అధిష్టానానికి నివేదించారు. బీసీ నేతలు మాత్రం ఓసీలకు ఇవ్వాలంటూ పట్టుబట్టడం గమనార్హం. ఇరువురి నేతల బేదాభిప్రాయాలతో సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ స్థానం కెటాయింపు విషయంలో అధిష్టానం పెండింగ్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

- Advertisement -

పార్టీలో అంతర్గత విబేదాలు …

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేదాలు తారాస్థాయికి చేరాయా? అంటే ఆపార్టీ కార్యకర్తలు నిజమే నంటు తలలు ఊపుతున్నారు. రాక రాక అధికారంలోకి వచ్చిన ఆపార్టీలో నేతల మధ్య సయోధ్య లేక, ఐక్యత కొరవడి ఆధిపత్య పోరుతో పార్టీ కార్యకర్తలు ఆగమవుతున్నారన్నది వాస్తవమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేతల మధ్య పొడ చూపిన విభేదాలతో పార్టీ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేక పోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వ్యక్తిగత విభేదాలు పార్టీ కార్యక్రమాలకు ఆటంకంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేస్తుంటే, మరోవైపు నాయకుల మధ్య సమన్వయ లోపం క్షేత్రస్థాయిలో ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. ఎవరి వర్గం వారిదే అన్నట్లుగా వ్యవహరించడం, కీలక నిర్ణయాల్లో అందరినీ కలుపుకుపోకపోవడం వంటి పరిణామాలు శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. అందుకు జరిగిన సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో 39 వార్డుల్లో అధికార పార్టీ ఐదారు స్థానాలు మాత్రమే గెలుచుకోవడం పట్ల విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, మున్సిపల్ పై జండా ఎగరవేయడం అధికార పార్టీ నేతల వైఫల్య మేనన్నది చర్చనీయాంశమైంది.

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, నాయకులకు సముచిత ప్రాధాన్యం కల్పించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి నాయకులంతా ఒకే వేదికపైకి వచ్చి ఐక్యంగా పనిచేస్తేనే పార్టీకి పూర్వ వైభవం సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వ్యక్తిగత ఆధిపత్యాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చి, సమన్వయంతో ముందుకు సాగితేనే రాజకీయంగా ఎదుగుదలకు మార్గం సుగమమవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

బీసీలకు ఏది ప్రాధాన్యత…

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుతో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అభిప్రాయాలతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి లో ఉన్నట్లు వారి మాటల్లోనే తెలుస్తోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలంటూ మెజార్టీ కార్యకర్తలు కోరుతుండగా, కొందరు నేతలు మాత్రం ఓసీలకు ఇవ్వాలని కోరడంలో అంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలు సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీలకు దక్కుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవు తుండగా, మరోవైపు బీసీలను ఎదగకుండా అణగదుకుతున్నారన్న ఆరోపణలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి.  అధిష్టానం జోక్యం చేసుకొని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నేతల మధ్య విభేదాలు దూరం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. నేతల మధ్య విభేదాలతో సిరిసిల్ల నియోజకవర్గంలో బలమైన నాయకత్వం లేకపోవడం ప్రతిపక్షాలకు ఎనర్జినిస్తున్నాయంటూ, అందుకు కొందరు కోవర్టుగా వ్యవహరిస్తున్నారూ అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కొసమేరుపు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News