పరకాల, అక్టోబర్ 6 (తెలుగు ప్రభ): తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశ నుంచే చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు శాతరాశి సనత్‌కుమార్ పటేల్ అలియాబాద్ గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సనత్‌కుమార్ పటేల్‌ను ఆయన సర్పంచ్ నివాసంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గుడిమల్ల రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి దశ నుంచే సనత్‌కుమార్ పటేల్ చురుకుగా పాల్గొని, ఉద్యమానికి తనవంతు కృషి చేశారని గుర్తుచేశారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి నేడు గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషకరమన్నారు. సర్పంచ్‌గా గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అలియాబాద్ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు అండగా నిలిచి, వారి సంక్షేమానికి తనవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

