HomeతెలంగాణNallabelli: ఉద్యమకారుల అరెస్టులు అప్రజాస్వామికం: ఆకుల సాంబారావు

Nallabelli: ఉద్యమకారుల అరెస్టులు అప్రజాస్వామికం: ఆకుల సాంబారావు

నల్లబెల్లి, నవంబర్ 5 (తెలుగు ప్రభ): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుడు, బచ్చన్నపేట పీఏసీఎస్ డైరెక్టర్ లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఉద్యమకారులను అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సాంబారావు తీవ్రంగా ఖండించారు.

- Advertisement -

తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ ఫలాలు అందుతాయని మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుడు మృతి చెందితే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? ఉద్యమకారులు తీవ్రవాదులా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో అరెస్టు చేసిన ఉద్యమకారులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, నల్లబెల్లి మండల జేఏసీ చైర్మన్ వేముల రాజు, మండల విద్యార్థి నాయకుడు మామిండ్ల చిన్న ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News