HomeతెలంగాణTAP ACT: న్యాయవాదులకు ఉక్కు కవచం.. నేటి నుంచే అమల్లోకి రక్షణ చట్టం

TAP ACT: న్యాయవాదులకు ఉక్కు కవచం.. నేటి నుంచే అమల్లోకి రక్షణ చట్టం

Telangana Advocates Protection Act: రాష్ట్రంలో గత కొంతకాలంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, హత్యాకాండలకు తెలంగాణ ప్రభుత్వం చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. ఈ మేరకు ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ‘తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం- 2026’ రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది. న్యాయవాదులపై పెరుగుతున్న దాడులు, బెదిరింపులు, తప్పుడు కేసుల నుంచి వారికి తగిన వృత్తిపరమైన భద్రత కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/trisha-indirectly-responds-to-rumors/

జైలు శిక్ష

న్యాయవాదులపై దాడి లేదా హింసకు పాల్పడే వారికి ఈ చట్టం ప్రకారం 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. విధి నిర్వహణలో ప్రాణహాని లేదా బెదిరింపులు ఎదుర్కొనే న్యాయవాదులకు పోలీస్ రక్షణ కల్పించేలా చట్టాన్ని రూపొందించారు. న్యాయవాదులపై తప్పుడు కేసులు నమోదు కాకుండా, అదేవిధంగా ముందస్తు నోటీసులు లేకుండా అక్రమంగా అరెస్టు చేయకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. న్యాయవాదుల సమస్యలు, భద్రతా పరమైన ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మెకానిజంను ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు. 

Also Read: https://teluguprabha.net/national-news/seven-people-died-in-a-collision-between-two-buses/

మూడో రాష్ట్రం

బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, హైకోర్టు బార్ అసోసియేషన్ల ప్రతిపాదనల మేరకు ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్ర శాసనసభ ఈ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ చట్టాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. కాగా, దేశంలో లాయర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన మూడవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ చట్టం అమల్లోకి రావడంతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఎటువంటి భయం లేకుండా తమ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించడానికి వీలవుతుందని న్యాయరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News