HomeతెలంగాణTelangana: బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం.. ఎన్‌. రాంచందర్‌రావు ధ్వజం

Telangana: బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం.. ఎన్‌. రాంచందర్‌రావు ధ్వజం

Ramchandra Rao: బీజేపీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై.. బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారానికి ఒడిగడుతోందని ఎన్‌. రాంచందర్‌రావు అన్నారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసి ఉంటే.. వారిపై చట్టప్రకారం తీసుకోవాలని తెలిపారు. అంతేతప్పా దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదన్నారు.

- Advertisement -

దుష్ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చు: బండి సంజయ్ ప్రతిష్టను దిగజార్చేందుకే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వేయించారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నాని ఆరోపించారు. రాజకీయాల్లో కేటీఆర్‌కు కనీస నైతిక విలువలు లేవని వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్‌ఎస్ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. అయితే ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని తెలిపారు.

Also read-Sircilla: సిరిసిల్లలో హైటెన్షన్.. పోలీసుల లాఠీచార్జ్!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News