Telangana BJP: ఈరోజు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం కానుంది. ఉదయం 9 గంటలకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పొలిటికల్ ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ కానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు,పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా ప్రతినిధుల పాత్రపై చర్చించే అవకాశం ఉంది.
Also Read: https://teluguprabha.net/sports-news/gujarat-titans-beat-chennai-super-kings-by-89-runs-ipl-2026/
మే 10న రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మరోవైపు జూన్ మొదటి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకి రానున్నారు. ఈ క్రమంలో హైకమాండ్ పెద్దల పర్యటనలతో రాష్ట్ర బీజేపీ నేతలు సంబంధిత పనుల్లో మునిగిపోయారు. జూన్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరు కానున్నారు. పది జిల్లాల నూతన బీజేపీ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/heavy-rush-in-ttd-due-to-holidays/

