HomeTop StoriesTelangana Cabinet: గోదావరి పుష్కరాలకు వెయ్యి కోట్లు.. తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Telangana Cabinet: గోదావరి పుష్కరాలకు వెయ్యి కోట్లు.. తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Telangana Cabinet allotted huge funds for Godavari Pushkaralu: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, సంబంధిత పనులకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం తొలి విడతగా రూ. 300 కోట్ల మంజూరుకు పచ్చజెండా ఊపింది.

- Advertisement -

Also read: Puri Jagannadh: భర్త ఏం చేసినా భార్య సర్దుకుపోవాలి.. వివాదాస్పదంగా మారిన పూరీ కామెంట్స్‌

జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం..

కాగా, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో అల్పాహారం, పాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక, అస్సాం రైఫిల్స్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్‌ జిల్లాను ఎంపిక చేసింది. అదే విధంగా కేసముద్రం ఫైర్‌స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరుకు అంగీకారం తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News