HomeTop StoriesGodavari Pushkaralu: గోదావరి పుష్కరాల కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ.. ఘాట్ల వద్ద శాశ్వత ఏర్పాట్లు.!

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ.. ఘాట్ల వద్ద శాశ్వత ఏర్పాట్లు.!

Godavari Pushkaralu: తెలంగాణలో 2027 ఏడాది రానున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు పుష్కరాల నిర్వహణకు 9 మందితో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబు వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి ఉండనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. 

- Advertisement -

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్నాయి.’దక్షిణ కుంభమేళా’గా పిలిచే ఈ మహా క్రతువును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడంతో పాటు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం తొమ్మిది మంది సభ్యులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Also Read: https://teluguprabha.net/telangana/governor-jishnu-dev-varma-cm-revanth-reddy-attends-dy-cm-bhatti-sons-marriage/

ఈ కేబినెట్‌ సబ్‌ కమిటీకి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీ సభ్యులుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పి.సుదర్శన్ రెడ్డిలు నియమితులయ్యారు. ఇక ఈ కమిటీకి కన్వీనర్‌గా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కొనసాగుతారు. ఇక, అవసరాన్ని బట్టి గోదావరి తీర ప్రాంతాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు త్వరలోనే కమిటీ సమావేశమై సిఫార్సులను అందజేస్తుందని సీఎస్‌ తెలిపారు.

గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ సారి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోరాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలో సుమారు 560 కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తోంది. దాదాపు 74 ఘాట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉండగా.. ముఖ్యంగా బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం ఆలయాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో అక్కడ ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీకి సీఎం సూచించారు.

Also Read: https://teluguprabha.net/telangana/police-arrest-accused-gangaraju-in-minor-girl-delivery-case/

ఇక, పుష్కరాల ఏర్పాట్లు తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా.. శాశ్వతంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధి, శాశ్వత పుష్కర ఘాట్లు, రోడ్లు, వసతి సముదాయాలు నిర్మించాలని అధికారులకు స్పష్టం చేశారు. రోజుకు రెండు లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్, పార్కింగ్, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News