HomeTop StoriesRevanth Reddy: కష్టజీవులకు కనీస వేతనం.. గత సర్కారుపై సీఎం రేవంత్ ఆగ్రహం

Revanth Reddy: కష్టజీవులకు కనీస వేతనం.. గత సర్కారుపై సీఎం రేవంత్ ఆగ్రహం

CM Revanth Reddy On Minimum wage hike in Telangana: శ్రమకు తగిన ఫలితం దక్కడం కాయకష్టం చేసుకునే ప్రతి కార్మికుడి ప్రాథమిక హక్కు అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కానీ, దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలోని కోట్లాది మంది కష్టజీవులు శ్రమ దోపిడీకి గురై కనీస వేతనాలకు నోచుకోక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక లోకానికి సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల సుమారు 1.11 కోట్ల మంది కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. వారికి అండగా నిలుస్తూ కనీస వేతనాలను భారీగా పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. 

- Advertisement -

పదేళ్ల నిర్లక్ష్యానికి చెక్.. శ్రామికులకు ఊరట : తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కార్మిక లోకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్ల పాటు కనీస వేతనాలను సవరించకపోవడంతో, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. కార్మికుల ఆదాయం మాత్రం పాతాళంలోనే ఉండిపోయిందన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశారని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఈ శ్రమ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా కొత్త వేతనాలకు రూపకల్పన చేశారు.

Also Read: https://teluguprabha.net/national-news/world-bee-day-2026-celebrated-with-great-fervor/

కార్మికుల నైపుణ్యాలు.. ప్రాంతాల వారీగా వర్గీకరణ : కనీస వేతనాలను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్ణయించేందుకు ప్రభుత్వం కార్మికులను వారి నైపుణ్యం ఆధారంగా నాలుగు రకాలుగా (Unskilled, Semi-skilled, Skilled, Highly skilled) విభజించింది. అన్‌స్కిల్డ్‌ (నైపుణ్యం లేనివారు), సెమీస్కిల్డ్‌ (పాక్షిక నైపుణ్యం గలవారు), స్కిల్డ్‌ (నైపుణ్యం గలవారు), హైస్కిల్డ్‌ (అధిక నైపుణ్యం గలవారు)గా కేటగిరీలను ఖరారు చేసింది. అదేవిధంగా, జీవన వ్యయం (Cost of Living) ఆధారంగా రాష్ట్రంలోని ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించింది.

జోన్‌-1: మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధి (వినియోగ వ్యయం అధికంగా ఉండే ప్రాంతాలు)
జోన్-2: మున్సిపాల్టీల పరిధి (పట్టణ ప్రాంతాలు)
జోన్‌-3: గ్రామీణ ప్రాంతాలు (పల్లెలు)

జోన్-1 పరిధిలో అమాంతం పెరిగిన వేతనాలు ఇలా..
కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా సీఎం రేవంత్ సర్కారు.. జోన్-1 (మున్సిపల్ కార్పొరేషన్లు) పరిధిలోని కార్మికుల కనీస వేతనాలను భారీగా సవరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
అన్‌స్కిల్డ్‌ కార్మికులు: గతంలో వీరికి నెలకు రూ.12,750 మాత్రమే రాగా, దాన్ని ఏకంగా రూ.16,000 కు పెంచారు.
సెమీస్కిల్డ్‌ కార్మికులు: పాత వేతనం రూ.13,592గా ఉండగా.. ప్రస్తుతం దాన్ని రూ.17,000 కు పెంచారు.
స్కిల్డ్ కార్మికులు: గతంలో రూ.13,772 ఉన్న వేతనాన్ని, ఏకంగా రూ.18,500 కు సవరించారు.
హైస్కిల్డ్‌ కార్మికులు: వీరికి గతంలో అత్యధికంగా రూ.14,607 మాత్రమే దక్కేది. ఈ మొత్తాన్ని భారీగా పెంచి రూ.20,000 గా నిర్ణయించారు.

Also Read: https://teluguprabha.net/national-news/ebola-virus-delhi-airport-issues-key-orders/

జూన్‌ 1 నుంచే అమలు.. కార్మికుల హర్షం : రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ఈ నూతన కనీస వేతనాలు జూన్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దశాబ్ద కాలంగా కనీస వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులకు భారీ ఊరట లభించినట్లయింది. కార్మిక చట్టాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ నిర్ణయం అద్దం పడుతోందని రాజకీయ, సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News