Election results Live updates: తెలంగాణలో గ్రామపంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఒంటి గంట లోపు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్:
- తెలంగాణలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు. అత్యధిక పోలింగ్ శాతం యాదాద్రి జిల్లాలో 87.93 శాతం నమోదైంది. మెదక్ జిల్లాలో 86 శాతం పోలింగ్ నమోదు. వరంగల్ జిల్లాలో 81.2 శాతం పోలింగ్ నమోదు. ములుగు జిల్లాలో 73.57 శాతం, హన్మకొండలో 75.6 శాతం, జనగాంలో 71.96 శాతం పోలింగ్ నమోదు. సూర్యాపేట జిల్లాలో 87.77 శాతం పోలింగ్ నమోదు. నల్గొండ జిల్లాలో 81.63 శాతం పోలింగ్ నమోదు. నిర్మల్ జిల్లాలో 79.81 శాతం పోలింగ్ నమోదు. ఆదిలాబాద్‌లో 69.10 శాతం పోలింగ్ నమోదు. మంచిర్యాల జిల్లాలో 77.34 శాతం పోలింగ్ నమోదు.
- తొలి దశ మొత్తం పంచాయతీలు – 4236
- వార్డు సభ్యులు – 37440
- ఏకగ్రీవం అయిన సర్పంచి పదవులు – 402
- ఏకగ్రీవం అయిన వార్డు సభ్యులు – 9812
- కాంగ్రెస్-1483
- బీఆర్ఎస్-632
- భాజపా-106
కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంతూరులో బీజేపీ గెలుపు
- మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత ఊరు రంగారెడ్డి గూడలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించింది.
- కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతికి 490 ఓట్లు వచ్చాయి.
తీవ్ర ఉత్కంఠ.. ఒక్క ఓటుతో గెలిచిన రోజా
- కామారెడ్డి (D) రాజంపేట (M) నడిమితండాలో సర్పంచ్ ఫలితాలల్లో తీవ్ర ఉత్కంఠకు తెర.
- హోరాహోరీ పోరులో కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ ఒక్క ఓటుతో గెలుపొందారు.
- సూర్యాపేట (D) తిరుమలగిరి(M) మర్రికుంట తండాలో సైతం కాంగ్రెస్ బలపరిచిన బానోత్ రోజా ఒకే ఒక్క ఓటుతో విజయం.
సమాన ఓట్లు.. టాస్‌తో గెలుపు:
- కోరుట్ల మండలం చిన్న మెట్ పల్లిలో 4వ వార్డకు పోటి చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి.
- టాస్ వేయడంతో వెలమల తిరుపతి గెలిచారు
- యాదాద్రి జిల్లాలోని 2 గ్రామాల్లో అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా డ్రా ద్వారా ఫలితం తేల్చారు. పారుపల్లిలో కవిత, లక్ష్మక్కపల్లిలో రాజయ్య గెలుపొందారు.
జగిత్యాల జిల్లా: తల్లిపై కూతురు విజయం:
- తల్లిపై కూతురు విజయం సాధించింది.
- కోరుట్ల మండలం తిమ్మాయిపల్లిలో తల్లి శివరాత్రి గంగవ్వపై, కాంగ్రెస్ ప్రతిపాదించిన పల్లెపు సుమలత గెలుపు
- బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన తల్లి శివరాత్రి గంగవ్వ
- కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచి గెలిచిన కూతురు సుమలత
వావ్..! నాలుగు ఓట్ల తేడాతో గెలుపు:
- కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రాగట్ల పల్లిలో బీఆర్‌ఎస్ బల పరిచిన అభ్యర్థి గెలుపు
- అభ్యర్థిని భాగ్య 4 ఓట్ల తేడాతో గెలుపు
- కామారెడ్డి మండలం రాఘవాపూర్‌లో బీజేపీ అభ్యర్థిని వెన్నెల విజయం
గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం హవా
- గట్టు మండలం సల్కాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బోయ తిమ్మప్ప(బీఆర్‌ఎస్) విజయం.
- గద్వాల మండలం మదనపల్లి గ్రామ సర్పంచ్ గా సంజీవులు(ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం) గెలుపు.
- ధరూర్ మండలం బూరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా విజేయులు(ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం) గెలుపు.
జగిత్యాలలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం:
- జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ తండా సర్పంచి మేఘావత్ లత గెలుపు
- మెట్ పల్లి మండలం కేసీఆర్ తండాలో ఇండిపెండెంట్ గుగ్లావాత్ మంజుల విజయం
- ఏఎస్ఆర్ తండాలో సురేందర్ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం
జగిత్యాలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు హవా:
- జగిత్యాల జిల్లాలో తొలివిడతలో బీఆర్ఎస్ హవా.
- కోరుట్ల నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులు విజయం
- మల్లాపూర్ మండలం వాల్గొండ తండా సర్పంచ్ గా వరుసగా రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురేష్ నాయక్ గెలుపు.
- మల్లాపూర్ మండలం హుస్సేన్ నగర్ గ్రామ సర్పంచ్ గా వరుసగా రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ సైదాబి-హైదర్ గెలుపు.
- మెట్ పల్లి మండలం రామారావు పల్లె సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రంభక్క రాజుకుమార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు.
- మల్లాపూర్ మండలం రేగుంట గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా తీట్ల లహరి-రాజేష్ గెలుపు.
- మల్లాపూర్ మండలం నడికూడ గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సమత-రాజేష్ గెలుపు

