HomeతెలంగాణGST : జీఎస్టీ ఖజానాకు 'కృత్రిమ మేధ' ధీమా.. సీఎం రేవంత్‌తో ప్రముఖ ఆర్థికవేత్త భేటీ

GST : జీఎస్టీ ఖజానాకు ‘కృత్రిమ మేధ’ ధీమా.. సీఎం రేవంత్‌తో ప్రముఖ ఆర్థికవేత్త భేటీ

Telangana GST revenue AI integration : రాష్ట్ర ఆర్థిక రథచక్రాలకు మరింత వేగం పుంజుకునేలా, ఖజానా ఆదాయాన్ని బహుళ రూపాల్లో పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సాంకేతిక బాట పట్టింది. ప్రభుత్వ సేవలను మెరుగుపరచడంతో పాటు పన్ను లీకేజీలకు చెక్ పెట్టేందుకు ‘కృత్రిమ మేధ’  రంగంలోకి దిగనుంది. జీఎస్టీ రాబడుల పెంపునకు ఏఐ సాంకేతికత ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశంపై ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డితో ప్రతిష్టాత్మక సమావేశం నిర్వహించారు. 

- Advertisement -

పన్ను లీకేజీలకు అడ్డుకట్ట – వివిధ శాఖల సమన్వయం : ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విస్తరణ, ఖజానా వృద్ధిపై విస్తృతంగా చర్చించారు. జీఎస్టీ, ఎక్సైజ్ వ్యవస్థల్లో సాంకేతిక లోపాలను అరికట్టేందుకు ఏఐ కీలక భూమిక పోషిస్తుందని సుబ్రమణియన్ తెలిపారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, మున్సిపల్, రెరా, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖలను ఏఐ ద్వారా అనుసంధానించాలని ప్రతిపాదించారు. భారీ భవనాలు, కాంట్రాక్టు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే దరఖాస్తు దశలోనే అవసరమైన నిర్మాణ సామగ్రి వివరాలు, పన్నుల అంచనాలను నమోదు చేస్తే పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు రాబడి : టెక్నాలజీ వినియోగం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పెంచేలా ఉండాలే తప్ప వ్యాపారాలకు ఆటంకాలు కలిగించకూడదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జీఎస్టీ అధికారులకు త్వరలోనే ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అలాగే పరిపాలనా సౌలభ్యం కోసం ఆరోగ్యశ్రీ, మీ-సేవా, సీఎం రిలీఫ్ ఫండ్ డేటాను సైతం ఒకే వేదికపైకి సమీకృతం చేయాలని నిర్ణయించారు.

ఉన్నతాధికారులతో సముచిత సమీక్ష : ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News