Friday, February 13, 2026
HomeతెలంగాణBandi Sanjay : బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట

Bandi Sanjay : బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా.. 5వ విడత పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బండి సంజయ్ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. ఆయన పాదయాత్రకు అనుమతినిచ్చింది. కానీ.. బహిరంగ సభకు మాత్రం షరతులు విధించింది. భైంసా సిటీలోకి యాత్ర ప్రవేశించకూడదని, సిటీకి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో బహిరంగ సభ పెట్టుకోవాలని షరతులు విధించింది. లా అండ్ ఆర్డర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులకు హైకోర్టు బెంచ్ సూచించింది.

- Advertisement -

బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర నేటి నుంచి ప్రారంభమవ్వాల్సి ఉంది. కానీ పోలీసులు ఆఖరి నిమిషంలో అనుమతి నిరాకరించి, పాదయాత్ర చేయకుండా అడ్డుకున్నారు. దీనిపై ఆదివారం రాత్రి హైడ్రామా నెలకొంది. నిర్మల్ వెళుతున్న సంజయ్ ను పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించాయి. యాత్రకు అనుమతి విషయంలో పోలీసుల తీరును తప్పుబడుతూ బండి సంజయ్ సోమవారం హైకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు ఊరట లభించింది. పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News