Kalvakuntla Kavitha new Party: కొత్త పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం పార్టీ పేరు ప్రకటించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం, సర్వోదయ తెలంగాణ కోసమే కొత్త రాజకీయ పార్టీ అవతరించనుందని స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/lord-rama-idol-looks-like-mahesh-babu-in-andhra-pradesh-temple/
ఏప్రిల్ 25న ఉదయం 10 గం.లకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సభలో కొత్త పార్టీపై ప్రకటన చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రెస్‌మీట్ మాట్లాడిన కవిత.. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి కావాలని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్వోదయ తెలంగాణ సాధన కోసమే కొత్త పార్టీ రావాలని చెప్పారు. తెలంగాణ సాధించి పన్నెండేళ్లు దాటిందని.. అయినా నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి పరిపాలనలో ఉన్నామో ప్రజలు ఆలోచించాలన్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/three-lpg-ships-to-arrive-at-visakhapatnam-port/
‘కొత్త రాజకీయ పార్టీ ఉండాలని బలంగా కోరుకుంటున్నాం. ఏప్రిల్ 25న బలమైన ముహూర్తం ఉంది. మేడ్చల్‌లోని మునీరాబాద్‌లో పార్టీ పేరు ప్రకటిస్తా. నేను నిజామాబాద్ కోడలిని.. తెలంగాణ బిడ్డను. నిజామాబాద్ మట్టి మంచిది. ఇక్కడి నుంచి తీసుకునే ఆలోచన, నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేస్తుంది. 20 రోజులుగా మార్క్‌ఫెడ్‌ను ఎందుకు ఓపెన్ చేయడం లేదు..? ప్రభుత్వం ఎందుకు దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది..?’ అని కవిత పేర్కొన్నారు.

