HomeతెలంగాణTelangana: ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం.. టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ

Telangana: ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం.. టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ

Telangana Journalists Forum: పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) అధ్యక్షుడు అల్లం నారాయణ మండిపడ్డారు. టీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు సంస్థ ఏర్పాటు అయి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -

ఆంధ్రుల విగ్రహాల వెనుక ఆంతర్యమేంటి?: టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఆంధ్ర నేతల విగ్రహాలను తెలంగాణలో ప్రతిష్టించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సమైక్యాంధ్ర వాదుల కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసిన ఘనత తెలంగాణ జర్నలిస్టుల ఫోరానిది. తెలంగాణ ప్రయోజనాల రక్షణ కోసం టీజేఎఫ్ మరోసారి తన చారిత్రక పాత్రను పోషించాల్సిన సమయం ఆసన్నమైంది.” అని అల్లం నారాయణ అన్నారు.

సీమాంధ్రుల చెప్పుచేతల్లో సీఎం రేవంత్!: టీజేఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సీమాంధ్ర నేతల చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌ పాలనలో తెలంగాణ అస్థిత్వానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర పాలకుల ఆలోచనలను తెలంగాణపై రుద్దే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు.

Also read-AP CM Chandrababu: “టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై.. బక్కని నర్సింహులు వ్యాఖ్యలు సరికాదు”

హాజరైన ప్రముఖులు: ఈ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో టీజేఎఫ్ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు ఎ. రమణ కుమార్, కందుకూరి రమేష్ బాబు, రమేష్ హజారి, యార నవీన్ కుమార్, గుంటిపల్లి వెంకట్, కడకంచి వెంకటేశ్, ధన్ రాజ్, రాకేష్ రెడ్డి, బాపు రావు, బిజ్జిగిరి శ్రీనివాస్, ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News