HomeTop StoriesTG Govt: ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. భూ రిజిస్ట్రేషన్ల పని వేళలు పొడిగింపు

TG Govt: ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. భూ రిజిస్ట్రేషన్ల పని వేళలు పొడిగింపు

Telangana Registrations: తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ భూ రిజిస్ట్రేషన్ల పని వేళలు పొడిగిస్తూ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31తో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని పని వేళలను పొడిగించింది. ఈ మేరకు ఈ నెల 28, 30, 31 తేదీల్లో అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేయనున్నాయి.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/traffic-restrictions-in-hyderabad-on-the-occasion-of-sri-ram-navami/

రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సాంకేతిక లోపాల వల్ల కలిగిన అంతరాయం దృష్ట్యా, రిజిస్ట్రేషన్ల శాఖ మార్చి 31 వరకు పని వేళలను పొడిగించింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రద్దీని తగ్గించడానికి, స్లాట్ బుకింగ్ సమయాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుంది. 

Also Read: https://teluguprabha.net/telangana/tg-high-court-refuses-to-stay-demolition-of-house-in-velugumatla-khammam/

కాగా, మార్చి 24 నుంచి సర్వర్ల సమస్యతో స్లాట్‌ బుకింగ్‌లు, చలాన్ల చెల్లింపులు ఆగిపోయిన విషయం తెలిసిందే. సర్వర్లు మొరాయించడం, సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పని వేళలను పొడిగించింది. వినియోగదారులు ఈ మార్పును గమనించి, తమ రిజిస్ట్రేషన్ పనులను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News