HomeతెలంగాణTelangana: రైతులకు శుభవార్త.. ఈ నెలాఖరులో రైతు భరోసా నిధులు విడుదల!

Telangana: రైతులకు శుభవార్త.. ఈ నెలాఖరులో రైతు భరోసా నిధులు విడుదల!

Rythu bharosa: అన్నదాతలకు రేవంత్‌ సర్కార్‌ తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను ఈ నెల నుంచే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి వివేక్ వెల్లడించారు. చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ కీలక ప్రకటన చేశారు.

- Advertisement -

రెండు విడతల్లో రూ. 9,000 కోట్లు: రైతు భరోసా కింద మొత్తం రూ. 9,000 కోట్లకు పైగా నిధులను పంపిణీ చేయానున్నట్లుగా మంత్రి తెలిపారు. దీనిని రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడత మార్చి నెలాఖరులో రూ. 4,500 కోట్లు విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. మిగిలిన నిధులను వచ్చే నెలలో (ఏప్రిల్) రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయం: ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాలను ప్రస్తావిస్తూ మంత్రి వివేక్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని గుర్తు చేశారు. సన్న వడ్లు పండించే రైతులకు ప్రభుత్వం ప్రత్యేక బోనస్ అందిస్తోందని వివరించారు. రాబోయే సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా డీసీఎంఎస్, ఐకేపీ సెంటర్లను సన్నద్ధం చేయాలని మార్కెట్ కమిటీలను ఆదేశించారు.

Also read-Medha Patkar: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలి.. సీఎంకు మేధా పాట్కర్ లేఖ!

కాళేశ్వరం పేరుతో ప్రజా ధనం వృధా: ఇదే సందర్భంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించిన సాగునీరు ప్రాజెక్టులను పక్కనబెట్టి.. కాళేశ్వరం పేరుతో ప్రజా ధనాన్ని వృధా చేశారని ఆయన మండిపడ్డారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News