Friday, February 13, 2026
HomeతెలంగాణMunicipal Elections: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు.. తుది ఓటర్ల జాబితా విడుదల.. వారే అత్యధికం.!

Municipal Elections: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు.. తుది ఓటర్ల జాబితా విడుదల.. వారే అత్యధికం.!

Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం ప్రకటించింది. 118 మునిసిపాలిటీలు, ఐదు మునిసిపల్ కార్పొరేషన్లలో కలిపి మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించింది.

- Advertisement -

రాష్ట్రంలో త్వరలో మున్సిపల్‌ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం.. మున్సిపాలిటీ వారిగా ఓటర్ల మ్యాప్‌ను సిద్ధం చేసింది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,996 వార్డులు ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 52,43,023 గా ఉందని తెలిపింది. అత్యధికంగా మహిళా ఓటర్లు 26,80,014 ఉండగా.. 25,62,369 మంది పురుషుల ఓటర్లు ఉన్నారని పేర్కొంది. 640 మంది ఇతరులు ఉన్నారని ప్రకటించింది. 

Also Read: https://teluguprabha.net/telangana-news/ramchander-rao-says-bjp-will-contest-the-municipal-elections-independently/

ఈసీ ప్రకటించిన జాబితా ప్రకారం.. ఐదు మున్సిపల్‌ కార్పొరేషన్లు కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, రామగుండంలలో అత్యధికంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 వార్డుల్లో కలిపి 3,48,051 ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 66 వార్డులు ఉండగా.. 3,40,580 మంది ఓటర్లు ఉన్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 వార్డుల్లో 1,97,841 మంది ఓటర్లు ఉన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో 1,81,778 మంది ఓటర్లు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 1,83,049 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది. 

ఆదిలాబాద్ మునిసిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉండగా, వనపర్తి జిల్లాలోని అమరచింత మునిసిపాలిటీ కేవలం 9,147 మంది ఓటర్లతో అతి చిన్న మునిసిపాలిటీగా నమోదైంది. పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. జూలై 2025లో పదవీకాలం ముగిసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల ప్రక్రియను చేపట్టారు.

Also Read: https://teluguprabha.net/business/pfrda-nps-assured-payouts-expert-committee/

ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC), ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలోని ఓటర్ల సంఖ్యపై ఎన్నికల సంఘం వివరాలను త్వరలో వెల్లడించనుంది. GHMC పదవీకాలం ఫిబ్రవరిలో ముగుస్తుండగా.. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News