Today Rains in tg: తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పగటిపూట ఉరుములతో కూడిన వర్షాలు, రాత్రిపూట అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 31°C, కనిష్ట ఉష్ణోగ్రత 24°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 మైళ్ళ వరకు పశ్చిమ దిశ నుండి వీచే అవకాశం ఉంది. వర్షపాతం అవకాశాలు పగలు 70%, రాత్రి 75% వరకు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:
మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాల వారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో:
తెలంగాణలో నిన్న భిన్న వాతావరణం కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో వేసవిని తలపించే ఉక్కపోత ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే సాధారణంగా 25°C నుంచి 33°C మధ్య కొనసాగింది. నిన్నటి రోజంతా పగటిపూట గాలిలో తేమ ఎక్కువగా ఉంది
ప్రజలకు సూచనలు:
వర్షం పడే సమయంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉంది.

